
జనరల్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనదైన హాస్యంతో అభిమానులను నవ్వించారు. మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా ప్రశాంతంగా ఎదుర్కొనే ధోనీకి కోపం తెప్పించగల వ్యక్తి ఎవరు అని అడగ్గా.. ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన భార్య సాక్షి ధోనీ పేరును చెబుతూ, ఆమె మాత్రమే తనకు వెంటనే కోపం తెప్పించగలదని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమాధానంతో అక్కడ నవ్వులు విరిశాయి.
సాక్షి తనను ఎంత త్వరగా స్పందించేలా చేయగలదో ధోనీ సరదాగా వివరించారు. ఆమె వేలితో చిన్నగా సైగ చేసినా తాను వెంటనే స్పందిస్తానని చూపిస్తూ అందరినీ నవ్వించారు. తనలోని ఈ ప్రత్యేకత గురించి సాక్షికి కూడా బాగా తెలుసని, దాని గురించి ఆమె గర్వంగా ఉంటుందని ధోనీ చమత్కరించారు. మైదానంలో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ‘కెప్టెన్ కూల్’.. వ్యక్తిగత జీవితంలోనూ తన హాస్యంతో అభిమానులను ఆకట్టుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!