
సినిమాలు

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం కోసం జరిగిన పోరుకు చేరుకుని భారత యువ రెజ్లర్లు కాజల్ దోచక్, నీలమ్ సిరోహి సంచలనం సృష్టించారు. అయితే, ఫైనల్స్‌లో ఓటమి ఎదురవడంతో ఇద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. బుధవారం జరిగిన మహిళల 76 కిలోల విభాగం ఫైనల్‌లో కాజల్ 6–8తో ఉక్రెయిన్‌కు చెందిన అనస్తాసియా అల్పెయెవేయా చేతిలో ఓడిపోయింది. చివరి వరకు గట్టిగా పోరాడినప్పటికీ స్వర్ణ పతకాన్ని అందుకోలేకపోయింది.
మహిళల 50 కిలోల విభాగం ఫైనల్‌లో నీలమ్ సిరోహి జపాన్ దిగ్గజ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ యుయి సుసాకితో తలపడింది. ఈ పోరులో సుసాకి ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా విజయం సాధించింది. ఇద్దరు భారత రెజ్లర్లు స్వర్ణ పతకాలను చేజార్చుకున్నప్పటికీ, ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్ వరకు చేరుకోవడం భారత రెజ్లింగ్‌కు గర్వకారణంగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!