
సినిమాలు

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించిన ఆహ్వాన టికెట్‌ను ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఐసీసీ చైర్మన్ జైషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెస్సీకి సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌తో పాటు బీసీసీఐ అధికారిక టీమ్ ఇండియా జెర్సీని కూడా బహూకరించారు. ఇది రెండు గొప్ప క్రీడా సంస్కృతులు కలిసిన అరుదైన ఘట్టంగా నిలిచింది.

క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత క్రీడల మధ్య ఈ అనుసంధానం కోట్లాది మంది పిల్లలను క్రీడల వైపు ఆకర్షిస్తుందని జైషా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భాలు యువతను ప్రోత్సహించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.









.jpeg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!