

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో బీసీబీ ప్రతిపాదించిన ‘గ్రూప్ స్వాపింగ్’ ఆలోచనను క్రికెట్ ఐర్లాండ్ స్పష్టంగా తిరస్కరించింది. తమకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే లీగ్ మ్యాచ్‌లు ఆడతామని, అవన్నీ శ్రీలంకలోనే జరుగుతాయని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ 2026 లో బంగ్లాదేశ్ గ్రూప్-సిలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలపై ఆడాల్సి ఉండగా, భద్రతా కారణాలను చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీబీ–ఐసీసీ మధ్య కీలక సమావేశం జరగగా, భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. అయినప్పటికీ బీసీబీ అంగీకరించక, గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో గ్రూప్ మార్పిడి చేయాలని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను ఐర్లాండ్ ఖరాఖండిగా తిరస్కరించడంతో బంగ్లాదేశ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!