

ఐపీఎల్ బ్రాండ్ విలువ ఈ ఏడాది గణనీయంగా తగ్గిందని బ్రిటన్లోని బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదికలో వెల్లడించింది. వారి వివరాల ప్రకారం, 2024 లో ఐపీఎల్ మొత్తం విలువ సుమారు రూ.1,07,867 కోట్లుగా ఉండగా, 2025 లో అది రూ.86,291 కోట్లకు పడిపోయింది. అంటే ఒకే ఏడాదిలో దాదాపు రూ.21,576 కోట్ల మేర విలువ కోల్పోయినట్లు అంచనా.
భారత్–పాకిస్తాన్ మధ్య ఈ సీజన్ జరుగుతున్న సమయంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం బ్రాండ్ విలువ తగ్గడానికి ప్రధాన కారణమని సంస్థ పేర్కొంది. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో ఐపీఎల్-2025 కొన్ని రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.
అదనంగా, ఈ సీజన్లో జట్ల కూర్పు, మెగా వేలం ప్రభావం, మరియు రసవత్తర పోటీలు తక్కువగా కనిపించడమూ బ్రాండ్ విలువను మరింత తగ్గించిందని నివేదికలో స్పష్టం చేసింది.
ఈ ప్రభావం ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ పై కూడా తీవ్రంగా పడింది. ఈ సీజన్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విలువ 10 శాతం తగ్గింది. చెన్నై సూపర్ కింగ్స్ 24 శాతం, రాజస్థాన్ రాయల్స్ 35 శాతం, సన్రైజర్స్ హైదరాబాద్ 34 శాతం, కోల్కతా నైట్రైడర్స్ 33 శాతం వరకూ తమ బ్రాండ్ విలువను కోల్పోయాయి.
ఇక ఫ్రాంచైజీలలో గుజరాత్ టైటాన్స్ మాత్రమే అపూర్వంగా 2 శాతం వృద్ధిని నమోదు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!