

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును అమ్మడానికి యాజమాన్యం నిర్ణయించిన సంగతి తెలిసింది. 2026 మార్చి 31 నాటికి RCB కు కొత్త యాజమాన్యం రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరో ఆశ్చర్యకరమైన వార్త బయటపడింది. RCB తో పాటు, ఐపీఎల్ లోని మరో జట్టు కూడా అమ్మకానికి పెట్టారట. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టును అమ్మకానికి ఉంచినట్లు జాతీయ మీడియా లో కథనాలు వెలుగొంటున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిర్ధారించారు.
ఐపీఎల్ లో ఒకటి కాదు, రెండు జట్లు అమ్మకానికి ఉన్నాయని హర్ష్ గోయెంకా వెల్లడించారు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లను అమ్ముతున్నారు. ఈ రెండు జట్లను కొనుగోలు చేయడానికి ఐదుగురు ప్రముఖ వ్యాపారవేత్తలు పోటీపడుతున్నారని, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే నగరాల నుంచి కొత్త యాజమాన్యాలు రావచ్చని అంచనా వేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇది జరుగుతుండగా, ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ ఆక్షన్ డిసెంబర్ 16 న జరగనుంది. ఈ ఈవెంట్‌ను ముందుగా ముంబైలో నిర్వహించాలని ప్రణాళిక వేసినా, కొన్ని అనివార్య కారణాల వల్ల బీసీసీఐ దీన్ని అబుదాబీ కి మార్చింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ను మార్చిలో ప్రారంభించనున్నారు. T20 వరల్డ్ కప్ 2026 ముగిసిన సమయంలోనే ఈ ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మార్చి 15 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ జరగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!