

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 72 పరుగులతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగా, అయుష్ బదోని కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చేసి వేగం పెంచాడు. చివర్లో అబ్దుల్ సమద్ 37 పరుగులతో మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, మార్కో జాన్సెన్ కూడా రెండు వికెట్లు సాధించాడు.
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయినా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ దూకుడుగా ఆడి 69 పరుగులు చేశాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను పూర్తిగా పంజాబ్ వైపు తిప్పాడు. కేవలం 51 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచిన శ్రేయస్ అయ్యర్, 11 ఫోర్లు, 5 సిక్సర్లతో లక్నో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. చివర్లో సూర్యాంశ్ షెడ్గే సహకారంతో పంజాబ్ కేవలం 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో కీలక రెండు పాయింట్లు సాధించగా, లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి బౌలింగ్ వైఫల్యంతో నిరాశ చెందింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!