

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants (LSG)) తమ కొత్త లోగోను అధికారికంగా విడుదల చేసింది. గతంలో నీలి రంగు ఆధారంగా ఉన్న లోగోను ఈసారి రెడ్ థీమ్‌తో మార్చారు. ఈ కొత్త ఎంబ్లమ్లో గరుడ, కిరీటం, ఏనుగు అనే మూడు ప్రధాన ప్రతీకలను చేర్చి లక్నో నగరం, ఉత్తరప్రదేశ్ సంస్కృతి, గౌరవాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు.
లోగోలోని గరుడ ప్రతీక జట్టు ధైర్యం, సవాళ్లను ఎదుర్కొని ఎత్తులకు ఎదగాలనే ఆశయాన్ని సూచిస్తుంది. కిరీటం జట్టు గౌరవం, బాధ్యతను తెలియజేస్తూ అభిమానుల నమ్మకాన్ని మోస్తున్నామనే భావనను ప్రతిబింబిస్తుంది. మధ్యలో ఉన్న ఏనుగు శక్తి, సహనం, జ్ఞానం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా జట్టుకు అండగా ఉండే అభిమానుల విశ్వాసాన్ని ఇది సూచిస్తుంది.
జట్టు యజమాని, RPSG గ్రూప్ వైస్ చైర్మన్ శశ్వత్ గోయెంకా మాట్లాడుతూ.. ఈ లోగో తమకు భావోద్వేగపూరితమైన గుర్తింపు అని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మొదటి నుంచే జట్టును ఆదరించారని, ఆ ప్రేమకు గుర్తుగా ఈ కొత్త లోగోను రూపొందించామని చెప్పారు. ఇది కేవలం డిజైన్ మార్పు మాత్రమే కాకుండా లక్నో నగర గౌరవాన్ని నిలబెట్టే వాగ్దానమని తెలిపారు. 2026 సీజన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో రిషభ్ పంత్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రం, మిచెల్ మార్ష్, మొహమ్మద్ షమీ, వనిందు హసరంగా, జోష్ ఇంగ్లిస్, అర్జున్ టెండూల్కర్ తదితర ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!