

మహిళల ప్రీమియర్ లీగ్ (TATA WPL) 2026 లో ప్లేఆఫ్స్‌కు చేరుకునే పోరు మరింత ఉత్కంఠగా మారింది. నేడు సాయంత్రం 6:30 గంటలకు ముంబై ఇండియన్స్ (MI) – గుజరాత్ జెయింట్స్ (GG) మధ్య జరగనున్న మ్యాచ్ ‘మస్ట్-విన్ క్లాష్’గా నిలుస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా టాప్-3 లోకి చేరి ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఓడిన జట్టుకు మాత్రం నెట్ రన్‌రేట్ (NRR) సమీకరణలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది.
ముంబై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఓడితే, యూపీ వారియర్స్ (UPW) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ను ఓడించాలని ఆశించాలి. అదే విధంగా గుజరాత్ గెలిస్తే వారు కూడా టాప్-3 లోకి ప్రవేశిస్తారు. గుజరాత్ ఓడితేనూ UPW–DC ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీ తేడాతో ఓడిపోకుండా జాగ్రత్తపడటం ఇరు జట్లకూ కీలకం. ప్లేఆఫ్స్ రేస్‌లో ఈ మ్యాచ్ ఫలితమే కీలక మలుపు తిప్పనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!