

స్క్వాష్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా స్క్వాష్ వరల్డ్ కప్‌ను గెలుచుకుని ప్రపంచ క్రీడా వేదిక పై సత్తా చాటింది. చెన్నయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బలమైన హాంకాంగ్ జట్టును 3-0 తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
టోర్నీ మొత్తం భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత్, టైటిల్ పోరులోనూ అదే జోరును కొనసాగించింది.
ఫైనల్లో ముందుగా ఉమెన్స్ సింగిల్స్‌లో జోష్న చినప్ప శుభారంభం చేసింది. లీ కా యిపై 7-3, 2-7, 7-5, 7-1 తేడాతో గెలిచి భారత్‌కు తొలి విజయం అందించింది. అనంతరం మెన్స్ సింగిల్స్‌లో అభయ్ అలెక్స్ లావుపై 7-1, 7-4, 7-4 తో ఏకపక్షంగా గెలిచి భారత్‌ను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
తర్వాత జరిగిన మరో ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో అనాహత్ సింగ్ 7-2, 7-2, 7-5 తో టొమాటో హోను ఓడించడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఈ ఘన విజయం భారత స్క్వాష్ చరిత్రలో స్వర్ణాధ్యాయంగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!