
జనరల్

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అనూహ్య పరాజయం ఎదురైన భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే చైనా మాస్టర్స్ టోర్నీలో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ కూడా పోటీపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్ భారత తరఫున తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.
డబుల్స్ విభాగంలో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పురుషుల డబుల్స్‌లో అర్జున్-హరిహరన్ జోడీ కూడా పోటీలో పాల్గొననుండగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో కపిల-తనీషా, రోహన్ కపూర్-రుత్విక జంటలు బరిలోకి దిగనున్నాయి. చైనా మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటి టైటిళ్లు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!