
జనరల్

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన సింపుల్, క్లాసిక్ స్టైల్‌తో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. సాధారణంగా సినీ తారలు ఖరీదైన రోలెక్స్, రిచర్డ్ మిల్లే వంటి లగ్జరీ వాచ్‌లతో కనిపిస్తుంటే.. విజయ్ మాత్రం కేవలం రూ.2,575 విలువైన హెచ్‌ఎంటీ విజయ్ వాచ్‌ను ధరించి కనిపించారు. ఈ లుక్ ఆయన సింప్లిసిటీపై మరోసారి ఆసక్తిని పెంచింది.
ఫ్యాషన్ అంటే భారీ ధర కలిగిన వస్తువులను ప్రదర్శించడం కాదని, వాటిని ధరించే విధానమే అసలైన స్టైల్‌ను ప్రతిబింబిస్తుందని విజయ్ లుక్ చెప్పకనే చెబుతోంది. భారతీయ వారసత్వానికి చెందిన క్లాసిక్ హెచ్‌ఎంటీ వాచ్‌ను ఎంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, సింప్లిసిటీతోనే నిజమైన స్టైల్ ఉంటుందని విజయ్ మరోసారి నిరూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!