

భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ‘స్వదేశీ’, ‘వోకల్ ఫర్ లోకల్’పై దృష్టి పెట్టాలని సూచించారు. విదేశీ పర్యటనలు, విదేశాల్లో వివాహాలు వంటి అవసరం లేని ఖర్చులను తగ్గించడంతో పాటు అత్యవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని మోదీ పేర్కొన్నారు.
మోదీ సూచనల నేపథ్యంలో బంగారం దిగుమతులు, వాణిజ్య లోటుపై చర్చ మళ్లీ మొదలైంది. జూలైలో భారత్ బంగారం దిగుమతులు 4.77 శాతం పెరిగి 4.16 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే నెలలో వస్తువుల వాణిజ్య లోటు 31.98 బిలియన్ డాలర్లకు పెరిగింది. అధిక దిగుమతులు విదేశీ మారకద్రవ్యంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దేశీయ వినియోగాన్ని ప్రోత్సహించడమే స్వదేశీ పిలుపు ప్రధాన ఉద్దేశమని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. అయితే వాణిజ్య లోటుకు బంగారం దిగుమతులతో పాటు ఎలక్ట్రానిక్స్, చమురు, ఎరువులు వంటి ఇతర దిగుమతులు కూడా కారణమవుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!