

సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి నెలకొననుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లలో తెరకెక్కిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’, సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ విడుదల కానున్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన ‘రోమాంచకం’కు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.
సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ థియేటర్లలోకి రానుంది. అదే రోజున నివీన్ పౌలీ, మమిత బైజు నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహమ్ కుటుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ కూడా విడుదల కానుంది. సెప్టెంబర్ 10న కార్తీ నటించిన ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సెప్టెంబర్ 24న నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. విభిన్న కథలు, జానర్లతో వస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!