

తిరువనంతపురంలో శ్రీలంక మహిళా జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా మహిళలు ఆధిపత్యం చాటారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 221 పరుగులు చేసి, శ్రీలంకకు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓపెనర్లు స్మృతి మంధాన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్సులు), షెఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడుతూ అర్ధశతకాలు నమోదు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 162 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం రిచా ఘోష్ (40*), హర్మన్‌ప్రీత్ కౌర్ (16*) కలిసి 52 పరుగుల నాటౌట్ భాగస్వామ్యాన్ని జోడించారు. శ్రీలంక బౌలర్లలో మాల్షా షెహనీ, నిమిషా మదుషని చెరో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ చమరి అథపత్తు 37 బంతుల్లో 52 పరుగులు చేయగా, హాసిని పెరీరా 33 పరుగులతో మద్దతిచ్చారు. పవర్‌ప్లేలో మెరుగైన ఆరంభం ఉన్నప్పటికీ, మధ్య ఓవర్లలో దీప్తి శర్మ, రేణుకా సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 4–0తో అజేయ ఆధిక్యంలో నిలిచింది. అలాగే దీప్తి శర్మ మహిళల టీ20ల్లో 151 వికెట్లతో ఆస్ట్రేలియా బౌలర్ మేగాన్ షుట్ రికార్డును సమం చేశారు.







.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!