
గాసిప్స్

అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో విఫలమైన 14 ఏళ్ల బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అతనికి తోడు కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జి, కుందు బ్యాటింగ్‌లో రాణిస్తే భారత జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన హెనిల్ పటేల్ కీలకంగా మారనున్నాడు. అతడిని ఎదుర్కోవడం బంగ్లాదేశ్‌కు పెద్ద సవాలేనని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఈ కీలక మ్యాచ్ జింబాబ్వేలోని బులవాయో వేదికగా మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!