

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భక్తులు, క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
భారత్-పాక్ మ్యాచ్ ప్రతిష్టాత్మక పోరుగా భావించే అభిమానులు, ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి అత్యుత్తమ ప్రదర్శన చేయాలని బాబా మహాకాళుడిని ప్రార్థించారు. మహాశివరాత్రి రోజున శివుడి ఆశీస్సులు ఉంటే టీమిండియా విజయాన్ని ఎవరూ ఆపలేరని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు.
కొలంబోలో మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భస్మ హారతి సమయంలో కూడా భక్తులు టీమిండియా విజయం కోసం ప్రార్థనలు చేశారు. ఉజ్జయినితో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా టీమిండియా గెలుపు కోసం యజ్ఞాలు, హవనాలు నిర్వహించటం విశేషం.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!