

అండర్–19 ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో భారత్ ‘నో–హ్యాండ్‌షేక్’ విధానాన్ని కొనసాగించింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయాలను జూనియర్ క్రికెట్‌కు దూరంగా ఉంచాలని కోరుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అభ్యర్థన వచ్చిందన్న వార్తలు ఉన్నప్పటికీ, భారత జట్టు అదే విధానాన్ని పాటించింది. గతంలో సీనియర్ ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లలోనూ ఇదే ధోరణి కొనసాగింది.
ఆదివారం జరిగిన గ్రూప్–ఏ మ్యాచ్‌లో టాస్ అనంతరం భారత కెప్టెన్ అయుష్ మాథ్రే, పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌తో హ్యాండ్‌షేక్ చేయలేదు. అవసరమైతే ముందుగానే మ్యాచ్ రిఫరీకి సమాచారం ఇవ్వాలని ఐసీసీ సూచించినట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. జూనియర్ క్రికెట్లో రాజకీయాల ప్రభావం కనిపించకూడదన్నదే ఐసీసీ ఉద్దేశమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
వర్షం కారణంగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. అయుష్ మాథ్రే నాయకత్వంలోని భారత జట్టు యూఏఈపై భారీ విజయంతో ఈ టోర్నీలోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొనగా, ‘నో–హ్యాండ్‌షేక్’ అంశం మరోసారి చర్చకు దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!