
గాసిప్స్

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో డీఎల్ఎస్ విధానంలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం ప్రభావంతో తగ్గిన లక్ష్యాన్ని భారత యువ ఆటగాళ్లు కేవలం 13.3 ఓవర్లలోనే ఛేదించి తమ దూకుడును చాటారు. ఈ మ్యాచ్‌లో భారత టీనేజ్ స్టార్లు అద్భుత ఫామ్‌లో కనిపించారు.
క్రీజ్‌లో ధైర్యంగా ఆడుతూ బౌండరీలతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఈ విజయం ద్వారా భారత్ సూపర్ సిక్స్ దశలోకి జోరుగా అడుగుపెట్టింది. యువ ఆటగాళ్ల ప్రదర్శన చూసి అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!