
గాసిప్స్

న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు భారీగా 271 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్ల దూకుడైన ఆటతో పాటు, బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడం మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4 – 1తో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్లోనూ పూర్తి ఆధిపత్యం చూపిన టీమ్ ఇండియా, సిరీస్ మొత్తంలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉత్సాహపరిచింది.
స్కోర్లు: భారత్ 271/5 (20 ఓవర్లు), న్యూజిలాండ్ 225 (19.4 ఓవర్లు).









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!