

ముంబయిలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం ఆదివారం అపురూప దృశ్యానికి వేదికగా నిలిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఫుట్‌బాల్ గోట్ లియోనెల్ మెస్సీ కలిసిన అరుదైన క్షణం అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తింది. క్రికెట్ లో సచిన్, ఫుట్‌బాల్‌లో మెస్సీ ఇద్దరిదీ నంబర్ 10 జెర్సీ కావడం ఈ భేటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘ది గోట్ ఇండియా టూర్’ లో భాగంగా ముంబయికి వచ్చిన మెస్సీ, రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ వాంఖడే లో జరిగిన ఆల్ స్టార్స్ మ్యాచ్‌ను వీక్షించారు. అభిమానుల కేరింతల మధ్య మైదానంలోకి వచ్చిన మెస్సీ ఆటగాళ్లతో కరచాలనం చేసి, సునీల్ ఛెత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఛెత్రికి నంబర్ 10 జెర్సీని బహుకరించారు.
ఈ సందర్భంగా సచిన్ 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ధరించిన తన నంబర్ 10 జెర్సీని మెస్సీ కి అందజేశారు. ప్రతిగా మెస్సీ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ బంతిని సచిన్ కు బహుకరించారు. ఈ క్షణం వాంఖడేలో అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!