
క్రీడలు

ఆఫ్ఘనిస్థాన్ వికెట్కీపర్, బ్యాటర్ అఫ్సర్ జజాయ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అబుదాబి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఐసీసీ అతడికి అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది.
ఈ చర్యల్లో భాగంగా అఫ్సర్ జజాయ్ క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా ఐసీసీ చేర్చింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించే ఆటగాళ్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!