

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినట్లు సమాచారం. కార్పొరేషన్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి 11, జనసేనకు నాలుగు, బీజేపీకి రెండు కార్పొరేషన్లు కేటాయించారు. బీజేపీకి రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్లు దక్కగా, జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు కేటాయించారు. మున్సిపాలిటీల్లోనూ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. టీడీపీ 78, జనసేన 21, బీజేపీ ఏడు మున్సిపాలిటీల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ కేటాయింపులతో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల పోటీ ప్రణాళిక స్పష్టమైంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 19, 20 తేదీల్లో నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించి, ఈ నెల 30న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రచారానికి, ఇతర ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!