
జనరల్

డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ తొలి గేమ్‌ను 21-12తో గెలుచుకుంది. అయితే, తర్వాతి రెండు గేమ్‌లలో 15-21, 19-21తో చైనాకు చెందిన జి టింగ్-రెన్ యు జోడీ చేతిలో ఓటమి పాలైంది.
సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 11-21, 21-13, 1-21తో ఫర్హాన్ చేతిలో పరాజయం చవిచూడగా, ఉన్నతి హుడా 21-23, 21-16, 16-21తో చైనాకు చెందిన హాన్ కియాన్ చేతిలో ఓడిపోయింది. అయితే, అస్మిత చాలీహా భారత శిబిరానికి ఊరటనిచ్చింది. బల్గేరియాకు చెందిన నల్బన్టోవాపై 21-18, 22-20తో వరుస గేమ్‌లలో విజయం సాధించి ప్రీక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!