16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన

Writer: Shivani K 10:47 PM, 15 అక్టోబర్, 2026
యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రానున్న 8 నుంచి 10 నెలల్లో నీరు, విద్యుత్ కొరత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 460 టీఎంసీలకు బదులుగా 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో నీటి నిల్వలు 72 శాతం, గోదావరి బేసిన్‌లో 40 శాతం తక్కువగా ఉన్నాయని, వర్షపాతంలోనూ 23 శాతం లోటు ఉందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యంగా వినియోగించాలని, యాసంగిలో వరి సాగును వాయిదా వేసుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నీటిని వృథా చేయకుండా ప్రతి చుక్కను పొదుపు చేయాలని ప్రజలకు సూచించారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెరిగిందని సీఎం వెల్లడించారు. రైతులకు, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. దసరా తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అనంతరం కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అవసరమైన సాయం కోరనున్నట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావం వంద దేశాల్లో కనిపిస్తోందని పేర్కొంటూ, కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను రేవంత్‌రెడ్డి ఖండించారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు, రైతులు, మీడియా, సినీ ప్రముఖులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యెమెన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకున్న హూతీల క్షిపణి దాడులు

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మార్లిన్ మన్రో ఏఐ ఫొటో పోస్ట్‌తో ట్రోలింగ్‌కు గురైన పాక్ రక్షణ మంత్రి

ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ రెండు రోజులు మూసివేత.. ఎన్‌డీఎంసీ కీలక ప్రకటన

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆసియా క్రీడల పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

రాజకీయ పార్టీలకు చదవగలిగే ఫార్మాట్‌లో ఓటర్ల తుది జాబితాల సాఫ్ట్ కాపీలు అందించేందుకు ఈసీ అంగీకారం

ట్యాగ్లు
తెలంగాణరేవంత్‌రెడ్డిఎల్‌నినోవరి సాగుయాసంగి పంటలునీటి కొరతవిద్యుత్ డిమాండ్తెలంగాణ రైతులుభట్టి విక్రమార్కకేంద్ర ప్రభుత్వ సాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌కు ఐసీసీ బిగ్ షాక్
క్రీడలు

ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌కు ఐసీసీ బిగ్ షాక్

ఎనర్జీ డ్రింక్ లేబుల్‌పై ఆంక్షలు.. పెప్సీ కీలక నిర్ణయం
బిజినెస్

ఎనర్జీ డ్రింక్ లేబుల్‌పై ఆంక్షలు.. పెప్సీ కీలక నిర్ణయం

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు
రాజకీయాలు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

యెమెన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకున్న హూతీల క్షిపణి దాడులు
జనరల్

యెమెన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకున్న హూతీల క్షిపణి దాడులు

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన
జనరల్

యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన

మార్లిన్ మన్రో ఏఐ ఫొటో పోస్ట్‌తో ట్రోలింగ్‌కు గురైన పాక్ రక్షణ మంత్రి
జనరల్

మార్లిన్ మన్రో ఏఐ ఫొటో పోస్ట్‌తో ట్రోలింగ్‌కు గురైన పాక్ రక్షణ మంత్రి

ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ రెండు రోజులు మూసివేత.. ఎన్‌డీఎంసీ కీలక ప్రకటన
జనరల్

ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ రెండు రోజులు మూసివేత.. ఎన్‌డీఎంసీ కీలక ప్రకటన

‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జయమ్మ లుక్‌తో అదరగొట్టిన సుమ
సినిమాలు

‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జయమ్మ లుక్‌తో అదరగొట్టిన సుమ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం
రాజకీయాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆసియా క్రీడల పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు
జనరల్

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆసియా క్రీడల పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!