

అఖిల భారత పోలీసు క్రీడల నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( సీఐఎస్ఎఫ్) నిర్వహించిన 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్-2026 హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (హెచ్‌వోపీఎఫ్) సి.వి. ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐఎస్ఎఫ్ ఏడీజీ విజయ్ ప్రకాశ్, డీఐబీ ప్రతినిధి ఎస్. సంబంధన్, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 36 పోలీసు, కేంద్ర సాయుధ బలగాల జట్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ పోటీలు జాతీయ సమైక్యతను బలోపేతం చేశాయని అన్నారు. ఓవరాల్ విజేతగా ఎస్ఎస్‌బీ, రెండో స్థానంలో సీఐఎస్ఎఫ్, మూడో స్థానంలో ఐటీబీపీ నిలిచాయి. క్రీడలు పోలీసు సిబ్బందిలో దేహదారుఢ్యం, క్రమశిక్షణ, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ, వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ అఖిల భారత పోలీసు క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!