

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు తెలంగాణలో గ్రామీణ, జిల్లా స్థాయి క్రికెట్‌ను బలోపేతం చేసే కార్యాచరణను ప్రకటించారు. ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో జిల్లా క్రికెట్ అకాడమీలు, గ్రౌండ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన జిల్లాల్లో 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో మైదానాలు, వసతి గృహాలు, కోచ్‌లు, మెస్, క్యాంటీన్, వాష్‌రూమ్‌లు వంటి ఆధునిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే సూర్యాపేట, జగిత్యాల, నాగర్‌కర్నూల్, సిద్దిపేటలో 15 ఎకరాల విస్తీర్ణంలో బీసీసీఐ ప్రమాణాలతో నాలుగు అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రాబోయే సీజన్ నుంచి ఇన్‌స్టిట్యూషన్ జట్లను ఏ, బీ, సీ డివిజన్లుగా విభజించి తెలంగాణ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది. ఈ నిర్ణయంతో దాదాపు 600 మందికి పైగా కొత్త ఆటగాళ్లకు లీగ్ వ్యవస్థలో అవకాశం లభించనుంది. జిల్లా ఆటగాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ సీ డివిజన్‌లో ఎనిమిది జిల్లా జట్లకు స్థానం కల్పించనున్నారు. అన్ని వయసుల జట్లకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక మెంటర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 టోర్నీకి లభిస్తున్న విశేష ఆదరణపై హెచ్‌సీఏ హర్షం వ్యక్తం చేస్తూ, జూలై 12న జరిగే ఫైనల్‌కు ముఖ్యమంత్రి, గవర్నర్‌ను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!