

భారత క్రికెట్‌లో సెప్టెంబరులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతిగా ఉన్న లక్ష్మణ్‌కు మరింత విస్తృతమైన బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఆయనను క్రికెట్ డైరెక్టర్‌గా నియమిస్తే టీమ్‌ఇండియా, సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది, CoE, ప్లేయర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల మధ్య సమన్వయం చేయడం వంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
భారత క్రికెట్ వ్యవస్థలో లక్ష్మణ్‌కు ఇప్పటికే విస్తృత అనుభవం ఉంది. CoE ద్వారా ఆటగాళ్ల అభివృద్ధి, ఫిట్‌నెస్, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఆయన.. అవసరమైన సందర్భాల్లో తాత్కాలిక కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 2024లో రాహుల్ ద్రవిడ్ తర్వాత ప్రధాన కోచ్ పదవికి అవకాశం వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతను స్వీకరించకుండా CoEలోనే కొనసాగారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!