

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సందర్భంగా ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో గడుపుతున్న వీడియోలు వైరల్ కావడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు మ్యాచ్‌ల సమయంలో కూడా తమ స్నేహితురాళ్లతో ప్రయాణిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిలో కొందరి భాగస్వాములు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావడం, గతంలో బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినట్లు ఆరోపణలు రావడం ఆందోళనకు కారణమైంది. కొందరి వ్యక్తిగత వివాదాలు పోలీస్ ఫిర్యాదుల వరకు వెళ్లడం కూడా బీసీసీఐ ప్రతిష్ఠకు దెబ్బతీసిందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇలాంటి వ్యవహారాలను ఇప్పుడే నియంత్రించకపోతే భవిష్యత్తులో మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. జట్టు బస్సుల వద్ద గర్ల్‌ఫ్రెండ్స్ కోసం ఆటగాళ్లు వేచి ఉండడం, ఒకే హోటళ్లలో బస చేయడం వంటి సంఘటనలు గమనించామని తెలిపారు. కొందరు ఆటగాళ్లు తమ భాగస్వాములను అధికారికంగా ప్రకటించినా, బీసీసీఐ నిబంధనల్లో ‘గర్ల్‌ఫ్రెండ్’ అనుమతికి ఎలాంటి ప్రావధానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం భార్యలు, కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమిత అనుమతి ఉంది. ఈ అంశంపై విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!