

పెర్త్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ తొలి టెస్టు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమై 164 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా సాధించిన ఆధిక్యాన్ని కలుపుకుని, కంగారూలకు 205 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఇంగ్లాండ్ తరపున గస్ అట్కిస్సన్ 37, ఓలీ పోప్ 33, డకెట్ 28 పరుగులతో కొంత ప్రతిఘటన చూపగా, మిగతా బ్యాట్స్మన్లు ప్రత్యేకంగా రాణించలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోల్యాండ్ 4 వికెట్లతో మెరిశాడు. స్టార్క్, బ్రైడెన్ డొగ్గెట్ చెరో మూడు వికెట్లు తీసి ఇంగ్లీష్ లైనప్‌ను కుదిపేశారు.
చాయ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా 3 పరుగుల వద్ద వికెట్లేమీ కోల్పోకుండా ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్రీజ్‌లో జాకీ విథెరాల్డ్ (0), ట్రావీస్ హెడ్ (3) కొనసాగుతున్నారు.
రోజు ప్రారంభంలో 123/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 132 పరుగుల వద్ద కుప్పకూలింది. అలెక్స్ క్యారీ 26తో టాప్‌స్కోరర్. కామెరూన్ గ్రీన్ (24), ట్రావీస్ హెడ్ (21) కూడా కొంత ప్రయోజనకరమైన పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీసి ఆసీస్‌ను వేగంగా కట్టడి చేశాడు. బ్రైడన్ కార్స్ మూడు, ఆర్చర్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు.


.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!