

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. 2026 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఆగస్టు 31న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ సందేశం ద్వారా అర్జెంటీనా జాతీయ జట్టుతో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. 39 ఏళ్ల మెస్సీ 2005లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్ సాధించారు. అయితే క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంటర్ మయామి తరఫున 2028 వరకు కొనసాగే ఒప్పందంతో ఆడుతున్నాడు.
అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన నేపథ్యంలో మెస్సీ సంపదపై కూడా చర్చ జరుగుతోంది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన నెట్‌వర్త్ 1.1 బిలియన్ డాలర్లు. 2026లో ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారుల జాబితాలో మెస్సీ 140 మిలియన్ డాలర్ల అంచనా ఆదాయంతో మూడో స్థానంలో ఉన్నారు. ఇందులో ఆట ద్వారా సుమారు 70 మిలియన్ డాలర్లు, ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాలు తదితరాల ద్వారా మరో 70 మిలియన్ డాలర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. స్పాన్సర్డ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా ఒక్కో పోస్టుకు సుమారు 2.7 మిలియన్ డాలర్లు సంపాదించవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!