

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రంగనాథ్ అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టు నేటి కారణాల జాబితాలో రంగనాథ్ వర్సెస్ శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో రెండు అప్పీళ్లు ఫ్రెష్ అడ్మిషన్‌గా నమోదయ్యాయి.
శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన ఆస్తి వివాదం నేపథ్యంలో హైడ్రా చర్యలపై ఇప్పటికే కోర్టులో పలు దశల్లో విచారణ జరిగింది. జూన్ 10న హైకోర్టు ఉత్తర్వుల్లో, గత కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ హామీల నేపథ్యంలో హైడ్రా అధికారులు సంబంధిత ప్రాంగణంలో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. అనంతరం కేసు పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో రంగనాథ్ తాజా అప్పీల్‌తో అంశం మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!