
జనరల్

నార్సింగిలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తన ఫోన్‌లోని వీడియోలను ఉపయోగించి ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి తన పరువుకు నష్టం కలిగించారని ఆమె ఆరోపించారు. తనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు చూపిస్తూ తప్పుడు ఏఐ వీడియోలు రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని మాధురి రాథోడ్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశ్వర్ సాయి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సమాచారం. ఘటనకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!