

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అప్పీలుకు నంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ అప్పీల్‌పై ఈ రోజు విచారణకు మార్గం సుగమమైంది.
ఈ పథకాలపై 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 12న సింగిల్ జడ్జి మధ్యంతర స్టే విధించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్‌రెడ్డి.. ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల పరిధిలో ఉన్నాయని, పథకాల అమలుతో పిటిషనర్ హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని వాదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!