
గాసిప్స్

2025లో అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్కు ముందు గాయం కారణంగా అనూహ్యంగా జట్టుకు దూరం అయినా.. లీగ్ దశలో అద్భుత సెంచరీలతో ఆకట్టుకుంది ప్రతీకా రావల్. తాజాగా ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం రూ.1.5కోట్ల రివార్డ్ అందించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘ప్రతీకా రావల్.. ఢిల్లీ యువ శక్తికి తార్కాణం. నూతన భారత దేశ స్త్రీ శక్తికి సజీవ స్వరూపం. ఆమె ప్రయాణం ఢిల్లీ కలలకు ప్రాణం ఇవ్వడమే కాకుండా, వాటికి రెక్కలు తొడిగింది’ అని రేఖా గుప్తా కొనియాడారు. రివార్డ్ అందించే సందర్భంగా జరిగిన సమావేశంలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ పాల్గొన్నారు




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!