

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాను ఐమాక్స్‌తో పాటు పలు ఇతర ఫార్మాట్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐమాక్స్ వెర్షన్ మినహా ఇతర ఫార్మాట్లలో ప్రీమియం ఫార్మాట్‌కు తగినట్లుగా పూర్తి స్క్రీన్‌ను నింపే ఫ్లాట్ కంటెంట్ ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్ద తెరపై సినిమాను పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేలా విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!