

భారత స్టార్ షట్లర్లు పి.వి. సింధు, లక్ష్యసేన్ హైలో ఓపెన్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21-13, 21-16తో మరో భారత షట్లర్ అన్మోల్ ఖర్బ్‌పై విజయం సాధించింది. తొలి గేమ్ ఆరంభంలో అన్మోల్ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ, సింధు పుంజుకుని విరామ సమయానికి 11-9తో ముందంజలో నిలిచింది. అదే జోరును కొనసాగిస్తూ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ అన్మోల్ నుంచి గట్టి పోటీ ఎదురైనా, దూకుడుగా ఆడిన సింధు వరుస గేముల్లో విజయాన్ని ఖాయం చేసుకుంది.
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-17, 21-13తో ఫ్రాన్స్‌కు చెందిన తోమా పొపోవ్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తొలి గేమ్‌లో పొపోవ్ నుంచి లక్ష్యకు గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ కీలక పాయింట్ల వద్ద ఆధిపత్యం ప్రదర్శించి ఆ గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో మరింత మెరుగ్గా ఆడి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ టోర్నీలో మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో భారత్‌కు టైటిల్ ఆశలు చిగురించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!