

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికలో తీసుకునే కఠిన నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాకపోయినా, ఒక ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టామో అతడికి స్పష్టంగా వివరించడం చాలా అవసరమని అన్నారు. అదే నిజమైన నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రోహిత్, ఈ టోర్నీని తొలిసారిగా ఇంటి నుంచే చూడబోతుండటం తనకు వింత అనుభవంగా అనిపిస్తోందన్నారు. గతంలో ప్రతి టీ20 ప్రపంచకప్‌లో తాను ఆడిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి ప్రేక్షకుడిగా ఉండటం కొత్త అనుభూతినిస్తుందని చెప్పారు.
గత టోర్నమెంట్లలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ఉదాహరణగా రోహిత్ వివరించారు. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ సమయంలో శ్రేయస్ అయ్యర్ స్థానంలో బౌలింగ్ చేయగలిగే దీపక్ హుడాను తీసుకున్నామని, జట్టు సమతూకం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే 2023 వన్డే ప్రపంచకప్‌లో చాహల్‌కు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో సిరాజ్‌కు కూడా ఇదే విధంగా వివరించినట్లు చెప్పారు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ సత్తా చాటుతుందని, జట్టు సగటు వయసు 25 ఏళ్లు కావడం సానుకూల అంశమని రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!