

డర్బన్‌లో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సౌతాఫ్రికా పై 101 పరుగుల భారీ విజయం నమోదు చేసింది. భారత్ 6 వికెట్లకు 175 పరుగులు చేసి బోర్డు పై మంచి స్కోర్ ఉంచగా, సౌతాఫ్రికా కేవలం 74 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేక రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ మైలురాయిని అంతకుముందే అర్ష్‌దీప్ సింగ్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) 100 పైగా వికెట్లు తీసిన తొలి భారత పేసర్‌గా బుమ్రా కొత్త చరిత్ర రాశాడు.
99 వికెట్లతో బరిలోకి దిగిన బుమ్రా, తన స్పెల్‌లో డేవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేస్తూ శత వికెట్‌ను సాధించాడు. ఆ క్షణంలోనే అర్ష్‌దీప్ పరుగెత్తుకుంటూ వచ్చి బుమ్రాను హత్తుకుని అభినందించాడు. ఈ సీన్ చూసి ఫ్యాన్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ మాట్లాడుతూ:
బుమ్రా భాయ్ కూడా 100 వికెట్ల క్లబ్లో చేరడం చాలా స్పెషల్‌గా అనిపించింది. వెంటనే వెళ్లి హగ్ ఇచ్చేశా. బుమ్రా భాయ్‌తో కలిసి బౌలింగ్ చేయడం ఎప్పుడూ ఎంజాయ్మెంట్. ఇద్దరం వికెట్లు తీస్తే కెప్టెన్‌కు పని చాలా సులభం అవుతుంది. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు ఎవరికిచ్చినా… మేము టీమ్‌కు మాక్సిమమ్‌గా ఉపయోగపడేలా చూస్తాం అని చెప్పాడు.
ఈ జోడీ బుమ్రా & అర్ష్‌దీప్, 2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టుకు కీలక బలంగా మారుతుందని అభిమానులు నమ్ముతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!