
జనరల్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన భవిష్యత్తుపై నిర్ణయం బీసీసీఐ దేనని చేసిన వ్యాఖ్యలపై బోర్డు అధికారికంగా స్పందించింది. ప్రస్తుతం జట్టు మార్పుల దశలో ఉందని, ఈ సమయంలో ఎలాంటి కోచ్ మార్పు చేసే ఆలోచన లేదని ఒక ఉన్నత అధికారి వెల్లడించారు.
ఇటీవలి రెండు టెస్ట్ సిరీస్‌లలో భారత జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొనడంతో, గంభీర్‌ను తప్పించాలని కొంతమంది మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే బోర్డు మాత్రం ప్రస్తుతం కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు అవసరం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
జట్టులో కొత్త ఆటగాళ్లు, మార్పులు జరుగుతున్న దశను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కోచింగ్ బృందంపై విశ్వాసం కొనసాగిస్తామని అధికారులు తెలియజేశారు. దీంతో గంభీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ప్రస్తుతం లేవని తేలిపోయింది.














కామెంట్స్ (1)
I feel it might be better to replace head coach Gambhir. He keeps changing the batting order and isn’t selecting the top-performing domestic players.