
గాసిప్స్

దేశీయ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త అందించింది. మహిళల దేశీయ క్రికెట్లో మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచుతూ కొత్త వేతన విధానాన్ని బీసీసీఐ ఆమోదించింది. ఇప్పటివరకు రోజుకు ₹20,000 గా ఉన్న మ్యాచ్ ఫీజును ఒకరోజు మరియు బహుదిన మ్యాచ్లకు రోజుకు ₹50,000 కు పెంచింది.
అలాగే, టీ20 దేశీయ మ్యాచ్లలో ప్లేయింగ్ ఎలెవన్ ( XI ) లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు ఒక్క మ్యాచ్కు ₹25,000 చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో మ్యాచ్ ఫీజులు 2.5 రెట్లు పెరిగినట్లవుతుండగా, మహిళా క్రికెట్ అభివృద్ధికి, ఆటగాళ్లకు మెరుగైన ఆర్థిక భద్రత కల్పించడంలో బీసీసీఐ కీలక అడుగు వేసింది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!