

ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం ఇటీవల పెద్ద చర్చకు దారి తీసింది. షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ ఈ ఆటగాడిని తీసుకోవడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువుల పై జరిగిన వరుస దాడుల నేపథ్యంలో, ముస్తాఫిజుర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం పై సోషల్ మీడియాలోనూ, అభిమానుల మధ్యనూ వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టులో కొనసాగించకుండా విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఈ వ్యవహారం ఐపీఎల్ ప్రతిష్ఠకు, భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
అలాగే, ముస్తాఫిజుర్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే, ఆ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు కేకేఆర్‌కు బీసీసీఐ అనుమతి ఇస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఐపీఎల్ 2026 ముందు కేకేఆర్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!