
గాసిప్స్

భారత్–బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య ఇటీవల పెరిగిన రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది టీమ్ఇండియా బంగ్లాదేశ్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు మైనారిటీలపై జరుగుతున్న దాడులు భద్రతాపరమైన ఆందోళనలకు కారణమవుతున్నాయి.
ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సెప్టెంబరులో భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నట్లు ప్రకటించినా, భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉండటంతో ఈ పర్యటనపై అనిశ్చితి కొనసాగుతోంది. గతంలోనూ ఇలాంటి కారణాలతో టీమ్ఇండియా బంగ్లాదేశ్ పర్యటన రద్దైన విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించిన మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే జరగనున్నాయని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!