

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025–26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాను అధికారికంగా ప్రకటించింది. అత్యున్నత గ్రేడ్ ఏ విభాగంలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కొనసాగుతుండటం గమనార్హం. అన్ని ఫార్మాట్లలో వారి స్థిరమైన ప్రదర్శనలకు ఇది నిదర్శనంగా బీసీసీఐ పేర్కొంది.
గ్రేడ్ బీ విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. గ్రేడ్ సీ జాబితాలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!