

భారత క్రికెట్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే భవిష్యత్తుపై చర్చలు జోరందుకున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు ప్రణాళికల్లో మార్పులు చేసే దిశగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జడేజా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్ స్థానంలో కొత్త ఎంపికలను పరిశీలిస్తున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
అక్షర్ పటేల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో అతనిపైనే జట్టు యాజమాన్యం ఎక్కువ నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో జరిగే 2027 ప్రపంచకప్‌లో పేస్‌కు అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమతుల్య జట్టును సిద్ధం చేయడంపై దృష్టి సారించిన టీమ్ మేనేజ్‌మెంట్, వాషింగ్టన్ సుందర్, యువ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే వంటి ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!