

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌కు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయని జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. తాజాగా, అతని భవిష్యత్తుపై చర్చించేందుకు బీసీసీఐ నవంబర్ 30 న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
తాజాగా స్వదేశంలో టీమ్ ఇండియా వరుస సిరీస్‌లను కోల్పోవడంతో గంభీర్‌పై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జట్టు బ్యాటింగ్ క్రమంలో మార్పులు, అవసరం లేని ప్రయోగాలు చేయడం, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వడం వంటి అంశాలపై బీసీసీఐకి అనేక ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనితో, గంభీర్‌పై వేటు వేసే అవకాశం బలంగా వినిపిస్తోంది.
నవంబర్ 30 న జరిగే సమావేశంలో గంభీర్ కొనసాగింపుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందని వార్తలు చెబుతున్నాయి. అతని చేత రాజీనామా చేయించి, కొత్త కోచ్‌ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. ఒకవేళ గంభీర్ తప్పుకుంటే, అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.











.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!