

2026 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ భాగస్వామ్యం పై నెలకొన్న వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు వెనుకంజ వేస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందు కొత్త ప్రతిపాదనను ఉంచింది.
తమ గ్రూప్‌ను ఐర్లాండ్‌తో పరస్పరం మార్చి, గ్రూప్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడే అవకాశం కల్పించాలని బీసీబీ కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన పై ఇటీవల జరిగిన సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే బంగ్లాదేశ్ సూచనకు క్రికెట్ ఐర్లాండ్ నుంచి గట్టి స్పందన వచ్చింది. తమకు కేటాయించిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఐసీసీ నుంచి స్పష్టమైన హామీ లభించిందని సీఐ స్పష్టం చేసింది. మా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు అన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. షెడ్యూల్ మార్పు ఉండదని ఐసీసీ స్పష్టంగా చెప్పింది అని ఒక సీఐ అధికారి తెలిపారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు గ్రూప్–సీ లో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్ జట్లతో కలిసి ఉంది. ఈ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబయి వేదికలుగా భారత్‌లో నిర్వహించనున్నారు.
ఇక ఐర్లాండ్ జట్టు గ్రూప్–బీ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్ జట్లతో పోటీ పడనుంది. ఈ గ్రూప్‌కు సంబంధించిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!