

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరుగుతున్న 46వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఓపెన్, మహిళల విభాగాల్లో రెండో రౌండ్‌లోనూ భారత జట్లు విజయాలు నమోదు చేశాయి. ఓపెన్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 2.5-1.5తో ఇండోనేసియాను ఓడించింది. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్.. సట్రియా దుతా చాహయాతో డ్రా చేసుకోగా, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద కూడా తమ ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకున్నారు. నిహాల్ సరీన్.. అరిఫ్ అబ్దుల్ హఫీజ్‌పై విజయం సాధించి భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు.
మహిళల విభాగంలో భారత్ 3-1తో ఫిన్లాండ్‌పై విజయం సాధించింది. సవిత శ్రీ, వంతిక అగర్వాల్, దివ్య దేశ్‌ముఖ్ తమ గేమ్స్‌లో గెలుపొందగా.. ఆర్. వైశాలి అనస్తాసియా కైననెన్‌తో గేమ్‌ను డ్రాగా ముగించింది. 2024 బుడాపెస్ట్ చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, మహిళల విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించిన భారత్.. ప్రస్తుతం రెండు విభాగాల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!