

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారంలో హౌస్‌లో గేమ్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. సెప్టెంబర్ 17 ఎపిసోడ్ “ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా” పాటతో హుషారుగా ప్రారంభమైంది. ఉదయాన్నే రోహిత్, షాలిని, సృష్టి మధ్య వంశీ ప్రవర్తనపై చర్చ జరిగింది. సుధీర్ మొదటి నుంచి ఒకే విధంగా ఉంటున్నాడని, వంశీ మాత్రం విజిబిలిటీ కోసం తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడని వారు మాట్లాడుకున్నారు. మరోవైపు కిచెన్‌లో ఆయిల్ వాడకంపై వంశీ చేసిన వ్యాఖ్యలతో వర్షిణి బాధపడి కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక హౌస్‌లో కీలకమైన పరిణామం రోహిత్, త్రిగుణ్ మధ్య చోటుచేసుకుంది. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వచ్చారు. తామిద్దరం బలమైన ప్లేయర్లమని, తమ మధ్య ఉన్న విభేదాలను ఇతరులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని త్రిగుణ్ చెప్పాడు. ఈ వారం ఒకరినొకరు టార్గెట్ చేయకుండా గేమ్ ఆడాలని సూచించగా, రోహిత్ కూడా సానుకూలంగా స్పందించాడు. అనంతరం రామ్ ప్రసాద్, దేబ్జానీ, త్రిగుణ్ కెప్టెన్సీ రేసులో పోటీపడగా త్రిగుణ్ పైచేయి సాధించాడు. ఇదే సమయంలో ముగ్గురు రాక్షసుల గెటప్‌లో వచ్చి షాలినిని బయటకు తీసుకెళ్తున్నట్లుగా డ్రామా చేయడంతో హౌస్‌మేట్స్ ఆందోళన చెందారు. చివరికి ముసుగు తొలగించగా తొలి వారంలో ఎలిమినేట్ అయిన చరణ్ రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం బయటపడింది. అయితే హౌస్‌లోకి తిరిగి వచ్చిన వెంటనే త్రిగుణ్‌ను ఛాలెంజ్ చేసిన చరణ్ ఆ టాస్క్‌లో ఓడిపోవడంతో అతని రీ-ఎంట్రీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!