

ప్రెగ్నెన్సీ కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో దీపికా పదుకొణే లేరనే ప్రచారం బాలీవుడ్‌లో వినిపిస్తోంది. రాకా, కింగ్ చిత్రాలకు కమిట్ అయిన ఆమె.. ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వకుండా తనకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో ఆమె తదుపరి ప్రాజెక్ట్స్‌పై కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో స్పిరిట్, కల్కి 2 చిత్రాలకు దీపిక దూరమైన విషయం తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్స్ నుంచి ఆమె తప్పుకోవడానికి భిన్న కారణాలపై అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం రాకా, కింగ్ సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కింగ్ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండగా, ఆమె పాత్ర పరిమితంగా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆరేళ్ల క్రితం ప్రారంభం కావాల్సిన ది ఇంటర్న్ రీమేక్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా తెరకెక్కితే పీకూ తర్వాత అమితాబ్ బచ్చన్‌తో దీపిక మరోసారి కలిసి నటించే అవకాశం ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!